పోసానిపై మరోసారి సంచలన కామెంట్లు చేసిన పృథ్వీరాజ్

పోసానిపై మరోసారి సంచలన కామెంట్లు చేసిన పృథ్వీరాజ్

0
83

మొత్తానికి రాజధాని అంశం ఇటు వైసీపికి తెలుగుదేశం జనసేన పార్టీలకి మాత్రమే కాదు.. సొంత పార్టీ నేతలకి కూడా
వివాదాలు పెడుతోంది. ఇప్పటికే వైసీపీలో పాసానికి పృథ్వీరాజ్ కి మధ్య వివాదం నడుస్తోంది రైతులని పెయిడ్ ఆర్టిస్టులు అని పృథ్వీరాజ్ కామెంట్ చేయడం పట్ల పోసాని తీవ్రస్ధాయిలో విమర్శలు చేశారు. తాజాగా దీనిపై పృథ్వీరాజ్ స్పందిస్తూ తాను ఏ రైతుని ఒక్క మాట అనలేదని కేవలం బినామీలని మాత్రమే ఆ మాటలు అన్నాను అని అన్నారు.

పోసాని, తాను అన్నదమ్ముల్లాంటి వాళ్లమని, తమ మధ్య ఎంతో సాన్నిహిత్యం ఉందని పృథ్వీరాజ్ అన్నారు అంతేకాదు . పోసాని నుంచి తాను ఎంతో నేర్చుకున్నానని, ఆయన చాలా మంచి వ్యక్తి అని తెలిపారు..పోసానిది మాట తప్పని.. మడమ తిప్పని నైజం అని ప్రశంసించారు పృథ్వీరాజ్..

అంతేకాదు తమ మధ్య స్నేహం ఎప్పటికీ నిలిచి ఉండాలని, ఆయన ఆశీర్వాదం తనపై ఎప్పటికీ ఉండాలని కోరుకున్నారు… రైతులను తాను ఒక్క మాట కూడా అనలేదని, చంద్రబాబు బినామీలను మాత్రమే తాను విమర్శించానని పృథ్వీ తెలిపారు. మొత్తానికి ఉప్పు నిప్పుగా కామెంట్లు చేసుకున్న ఇరువురు ఇలా మాట్లాడటం పై అందరూ ఇది మంచి పరిణామం అంటున్నారు.