కేసీఆర్ నిర్ణయాలపై పోసాని సంచలన కామెంట్

కేసీఆర్ నిర్ణయాలపై పోసాని సంచలన కామెంట్

0
110

దిశనిందితులను చంపడం కరెక్ట్ అని చాలా మంది భావిస్తున్నారు.. సమాజంలో పోలీసులు నిన్న జరిపిన ఎన్ కౌంటర్ తో, పోలీసులకు పెద్ద ఎత్తున అభినందనలు వస్తున్నాయి.. రాజకీయ సినిమా నటులు చిత్రకారులు అలాగే పారిశ్రామికవేత్తలు క్రీడాకారులు అందరూ కూడా పోలీసులు చేసిన చర్యని సమర్ధిస్తున్నారు.

తాజాగా ఈ అంశం పై వైసీపీ సీనియర్ నాయకుడు నటుడు దర్శకుడు పోసాని కృష్ణమురళి మాట్లాడారు. తాజాగా ఇంటర్వ్యూలో పలు విషయాలు తెలియచేశారు.. గ్యాంగ్ స్టర్ నయీమ్ గురించి ఓ మాట చెప్పారు ఆయన. చాలా ప్రభుత్వాలు చూశాం.. గతంలో కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు పాలన చేశాయి. అప్పుడు గ్యాంగ్ స్టర్ నయీం తిరిగేవాడని అందరికి తెలుసు , అదే, కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇలాంటి వ్యక్తి ప్రజల మధ్య ఉండకూడదని ఆయన ఎప్పుడైతే చెప్పారో ఆ తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలుసని అన్నారు. ఇలాంటి రాక్షసులు సమాజంలో ఉండకూడదు అని ఆయన అన్నారు.

నయీమ్ అంటే ప్రభుత్వానికి, మంత్రులకు, ఎమ్మెల్యేలకు భయం కాని కేసీఆర్ ఎవరికి భయపడడు ఆయన నలభై కిలోల డైనమైట్ అని ప్రశంసించారు. కేసీఆర్ తీసుకునే నిర్ణయాలు అలాగే ఉంటాయి అని ఆయనని కొనియాడారు పోసాని