పొలిటిక్స్ కోసం బ్లడ్ రిలేషన్స్ ను కాదనుకున్న కుటుంబాలు ఇవే…

పొలిటిక్స్ కోసం బ్లడ్ రిలేషన్స్ ను కాదనుకున్న కుటుంబాలు ఇవే...

0
96

రాజకీయం రాజకీయమే….రక్త సంబంధం రక్త సంబంధమే…. అధికారం కోసం రక్త సంబంధాలను పక్కన పెట్టిన రోజులుగా నేటి రాజకీయాలు తయారు అయ్యాయి…. కొత్త తరహా రాజకీయాలు ఏం కాకపోయినా ఇప్పుడు ఇదే ఏపీలో చోటు చేసుకుంటుంది.

ప్రస్తుతం ఏపీలో దశాబ్దాలుగా నమ్మకంగా ఉన్న కుటుంబాలే ఇప్పుడు రాజకీయంగా వేరే కుంపటి పెట్టేసుకుంటున్నాయి… ఎన్నికలనాటికి వీరు కలిసిపోతారా లేక విడిగా పోటీ చేస్తారా అనేది ఇప్పుడు ప్రశ్నార్థకమే… కేఈ కుటుంబాన్ని తీసుకుంటే ఈ కుటుంబానికి పత్తికొండ, డోన్ సెగ్మెంట్ లలో పట్టుంది…

ఈ రెండు సెగ్మెంట్ లలో కొన్నిదఫాలుగా కేఈ కుటుంబమే పోటీ చేస్తూ వస్తోంది… అయితే ఇటీవలే కేఈ ప్రభాకర్ టీడీపీకి రాజీనామా చేశారు… ఆయన టీడీపీకి గుడ్ బై చెప్పినా క్యాడర్ అలాగే ఉందని టీడీపీ అదిష్టానం చెబుతోంది… కానీ ఆయన సోదరులు కేఈ కృష్ణ మూర్తి, కేఈ ప్రతాప్ లు టీడీపీలోనే ఉన్నారు…

ఇక నెల్లూరు జిల్లాలో ఇదే పరిస్థితి… బీద సోదరులు దశాబ్దాల కాలంపాటు నుంచి టీడీపీని అంటిపెట్టుకుని ఉన్నారు… అన్నదమ్ములు అయిన బీద మస్తాన్ రావు బీద రవిచంద్రలు ఇప్పటికీ కలిసి వ్యాపారం చేస్తున్నారు… ఇటీవలే బీద మస్తాన్ వైసీపీ తీర్ధం తీసుకున్నరు… కానీ ఆయన సోదరు మాత్రం టీడీపీలో ఉన్నారు…