అందుకే వైసీపీలో చేరా టీడీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత

అందుకే వైసీపీలో చేరా టీడీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత

0
50

తెలుగుదేశం పార్టీకి ఎమ్మెల్సీలు ఒక్కొక్కరు గుడ్ బై చెబుతున్నారు, తాజాగా టీడీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ రాజీనామా చేశారు.. అయితే ఇప్పుడు మరో ఎమ్మెల్సీ కూడా తెలుగుదేశం పార్టీకి ఎమ్మెల్సీ గుడ్ బై చెప్పారు, చీరాల టీడీపీ నేత టీడీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత వైసీపీ గూటికి చేరారు.

సీఎం జగన్ సమక్షంలో పోతుల సునీత వైసీపీలో చేరారు… సునీతకు సీఎం కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. శాసనమండలిలో సునీత ప్రభుత్వానికి మద్దతు నిలిచారు. అయితే ఆ సమయం నుంచి ఆమె వైసీపీలో చేరుతారు అని అనుకున్నారు, నేడు వైసీపీలో చేరుతారు అని ఉదయం తెలిసింది చివరకు ఆమె వైసీపీలో చేరిపోయారు.

వైసీపీలో చేరడానికి కారణం జగన్ తీసుకున్న నిర్ణయాలు నచ్చి పార్టీలోకి చేరుతున్నాను అని..సంక్షేమ పథకాలు, అభివృద్ధికి సంబంధించి సముచిత నిర్ణయాలు తీసుకుంటున్నారు…అలాగే అన్ని ప్రాంతాలు డవలప్ మెంట్ జరుగుతాయి కాబట్టి మూడు రాజధానులకి తాము మద్దతు తెలుపుతున్నాను అని ఆమె తెలిపారు, అందుకే వైసీపీకి అనుకూలంగా ఓటు వేశాను అని తెలిపారు ఆమె.