ప్రభాస్ పైమాజీ మంత్రి సోమిరెడ్డి ప్రశంసలు

ప్రభాస్ పైమాజీ మంత్రి సోమిరెడ్డి ప్రశంసలు

0
78

కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం కఠిన నియమాలు ఆంక్షలు పెట్టింది, అయితే ఈ సమయంలో ప్రధాని సహయ నిధికి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకి కోవిడ్ కట్టడికి విరాళాలు ఇస్తున్నారు..టాలీవుడ్ హీరో ప్రభాస్ భారీ విరాళం ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పందిస్తూ ప్రభాస్ పై ప్రశంసలు కురిపించారు.

బాహుబలి చిత్ర రికార్డుల్లోనే కాదు, కరోనా విరాళాల్లోనూ తెలుగు సినీ రంగంలో ప్రభాస్ ముందుండటం అభినందనీయమని కొనియాడారు.

చిన్న వయస్సులోనే పెద్ద మనస్సు చాటుకుంటూ ప్రధాన మంత్రి సహాయ నిధికి రూ.3 కోట్లు, ఏపీ, తెలంగాణలో సీఎంల సహాయనిధికి కోటి రూపాయలు ఇవ్వడం చాలా గొప్ప విషయమని ప్రశంసిస్తూ ఓ ట్వీట్ చేశారు. ఇక ఇలా పెద్ద ఎత్తున విరాళాలు ఇవ్వడంతో ప్రజలు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు, మాజీ మంత్రిగారు ప్రభాస్ గురించి ఇలా అనడంతో అభిమానులు ఆనందంలో ఉన్నారు.