కేటీఆర్ ట్వీట్ పై స్పందించిన సూపర్ స్టార్, రెబల్ స్టార్

కేటీఆర్ ట్వీట్ పై స్పందించిన సూపర్ స్టార్, రెబల్ స్టార్

0
96

ఇటీవల తెలుగు రాష్ట్రాలలో భారీగా కురిసిన వర్షాలతో దోమల బెడద పెరిగిపోయింది. దీంతో ప్రజలు డెంగ్యూ, మలేరియా వంటి భయంకరమైన విష జ్వరాల బారిన పడుతున్నారు. అయితే ప్రజలు వ్యాధుల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మంత్రి కేటీఆర్ ట్వీట్ చే శాడు .

వైరల్ ఫీవర్ డెంగీ తదితర వ్యాధులు సోకకుండా ఉండాలంటే తప్పనిసరిగా ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని, నీటి తొట్టెలు పూల కుండి ఎయిర్ కూలర్ లో నీటి నిల్వ చేయకూడదని కేటీఆర్ సూచించారు . తన ఇంట్లో తనిఖీ చేసి నిల్వ ఉన్న నీటిని తొలగించాలని తన ఫోటోలను షేర్ చేసి తెలిపారు కేటీఆర్.

దీనిపై టాలీవుడ్ హీరోలు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, ప్రిన్స్ మహేష్ బాబు లు స్పందించారు. కేటీఆర్ ప్రస్తావించిన “హైదరాబాద్ నగర వాసులారా” విషయాలను మహేష్ ప్రస్తావించారు. అప్రమత్తంగా ఉంటూ ఎవరి గురించి వారే తగు జాగ్రత్తలు తీసుకోవాలని వారు తెలిపారు.