ప్రజల ఆకలి బాధలు కాని ఈ రాజు 15 మంది పెళ్లాల కోసం ఖరీదైన గిఫ్ట్ లు

ప్రజల ఆకలి బాధలు కాని ఈ రాజు 15 మంది పెళ్లాల కోసం ఖరీదైన గిఫ్ట్ లు

0
102

దేశాన్ని పాలించే రాజు అంటే అధికారం దర్పం అన్నీ ఉంటాయి, అయితే పేద ప్రజల పక్షాన ఉండాలి, వారి బాధలు తెలుసుకోవాలి, వారికి ఏం కావాలో అవి చేయాలి, కాని కొందరు మాత్రం అవేమీ పట్టించుకోరు, వారి సౌక్యాలు సుఖాలకే సమయం కేటాయిస్తారు.

ముఖ్యంగా దేశంలోని ప్రజలకు కనీస అవసరాలైన కూడు, గుడ్డ, నీడ కల్పించాలి. కానీ, ఆఫ్రికా ఖండంలోని స్వాజిలాండ్ రాజు కాస్త డిఫరెంట్ , ఇక్కడ ప్రజలు కరువుతో అల్లాడిపోతుంటే.. స్వాజీ రాయల్ ఫ్యామిలీకి చెందిన మస్వతి-III రాజు మాత్రం సోకులు చేసుకుంటున్నాడు.

జనాల బాధలు పక్కన పెట్టి, ఏకంగా తన 15 మంది భార్యలకు భారీ గిఫ్టులు కొనిచ్చాడు
ప్రజల సొమ్ముతో.. ఏకంగా 120 బీఎండబ్ల్యూ కార్లు ఆర్డర్ చేశాడు. వీటి విలువ రూ.175 కోట్లు అని అంచనా. అతడి 15 మంది భార్యలకు 15 మంది పిల్లలు ఉన్నారు. వారికోసం ఈ కార్లు కొన్నాడు, దేశం ఆదాయం సంపద అంతా వీరి ఖర్చులకే సరిపోతోంది, దీంతో అక్కడ జనాలు కూడా గోల పెడుతున్నారు.