ప్రముఖ జర్నలిస్ట్ TNR కన్నుమూత

ప్రముఖ జర్నలిస్ట్ TNR కన్నుమూత

0
101

ప్రముఖ జర్నలిస్ట్ తుమ్మల నరసింహ రెడ్డి కన్నుమూశారు, టీఎన్ ఆర్ అంటే తెలుగు వారికి అందరికి తెలిసిన వ్యక్తి, యూ ట్యూబ్ లో ఐ డ్రీమ్ మీడియాలో ఇంటర్వ్యూలు చేస్తూ సినిమా వారితో ఎన్నో విషయాలను ఇంటర్వ్యూల ద్వారా తెలియచేసేవారు… ఆయన చాలా మృదుస్వభావి, కొన్ని రోజులుగా కరోనాతో ఆయన హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.

 

సోమవారం ఉదయం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ కన్నుముశారు. జర్నలిస్టుగా సినిమా జర్నలిస్టుగా ఎంతో పేరు ఉంది, కొన్ని సంవత్సరాలుగా సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు, ఇక ఇటీవల పలు సినిమాల్లో కూడా ఆయన నటిస్తున్నారు, ఇలా సినిమాలు చేస్తూ ఇంటర్వ్యూలు చేస్తూ బిజీగా ఉన్నారు.

 

ఫ్రాంక్లీ స్పీకింగ్ విత్ TNR అంటూ తనదైన శైలిలో ఇంటర్వ్యూలు చేస్తూ చాలా పాపులర్ అయ్యారు. అందరితోనూ కలివిడిగా ఉండే మనస్తత్వం.. ఇటీవల శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రావడంతో ఆయనను కుటుంబ సభ్యులు హైదరాబాద్ లో ని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.. నిన్నటి వరకూ ఆయన కోలుకుంటున్నారు అని అందరూ భావించారు కాని ఈరోజు ఈ విషాద వార్త వినాల్సి వచ్చింది, అందరూ కూడా ఆయనకు సంతాపం తెలియచేస్తున్నారు.