ఐసీఐసీఐ కేసు.. అదుపులోకి ప్రణయ్ రాయ్‌

ఐసీఐసీఐ కేసు.. అదుపులోకి ప్రణయ్ రాయ్‌

0
98

ఎన్‌డీటీవీ వ్యవస్థాపకుడు ప్రణయ్ రాయ్, ఆయన భార్య రాధికాలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. విదేశాలకు వెళ్లేందుకు ముంబై విమానాశ్రయానికి చేరుకున్న వీరిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వీరిపై కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ అవినీతి కేసు దాఖలు చేసింది. ఐసీఐసీఐ బ్యాంకు వద్ద రుణం తీసుకున్న కేసులో ప్రణయ్ రాయ్‌పై విచారణ జరుగుతున్నది. కానీ వడ్డీతో సహా రుణాన్ని చెల్లించినట్లు ఎన్డీటీవీ ఓ ప్రకటనలో పేర్కొన్నది. సీబీఐ జారీ చేసిన లుకౌట్ సర్క్యూలర్ ఆధారంగానే రాయ్ దంపతులను ముంబై విమానాశ్రయ పోలీసులు అడ్డుకున్నారు. ఆర్ఆర్‌పీఆర్ హోల్డింగ్ ప్రైవేటు సంస్థ.. ఐసీఐసీఐ బ్యాంకుకు సుమారు 48 కోట్లు రుణపడి ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఆ కేసునకు సంబంధించి వీరిని విదేశాలకు వెళ్లనీయకుండా పోలీసు వర్గాలు అడ్గుకున్నట్లు తెలుస్తున్నది. ఈ నెల 16న భారత్‌కు తిరిగిరానున్న వీరిద్దరు ఎక్కడికి వెళ్లుతున్నారో మాత్రం తెలియరాలేదు. వీరిద్దరి అదుపులోని తీసుకున్న విషయంపై ముంబై విమానాశ్రయ వర్గాలు స్పందించడానికి నిరాకరించాయి. నెలరోజుల క్రితం జెట్ ఎయిర్‌వేస్ అధినేత నరేష్ గోయల్ కూడా విదేశాలకు పారిపోవాలని చూశారు.