ఇన్నాళ్లకు ఆ రామయ్యకు అయోధ్యలో ఆలయాన్ని నిర్మిస్తున్నారు…అయోధ్యలో ఉన్న వివాదాస్పద భూమి రామయ్యదేనని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత హిందువుల కల సాకారం కాబోతోంది.
ఆకోదండ రాముడికి ఆయన జన్మించిన అయోధ్య నగరంలో దివ్య మందిరాన్ని నిర్మించేందుకు
నేడు భూమి పూజా కార్యక్రమం జరుగనుంది.
5 గోపురాలతో, 69 ఎకరాల్లో 3 అంతస్థుల్లో 161 అడుగుల ఎత్తులో ఆలయం నిర్మితమవుతోంది. ఇక ఈ ఆలయం ప్రపంచంలో మూడోస్దానంలో ఉంటుంది. మరి మొదటి స్ధానం రెండోస్ధానం ఏ దేవాలయాలో చూద్దాం.
కంబోడియాలోని అంగోకర్‌వాట్ టెంపుల్ తొలి స్థానంలో, తమిళనాడులోని తిరుచిరాపల్లి రంగనాథ స్వామి ఆలయం 2వ స్థానంలో ఉంది. ఇక అయోధ్యలో స్వామి ఆలయానికి భూమి పూజ నేడు జరుగుతోంది, ప్రధాని మోదీ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరుగుతోంది. 12.45గంటల వరకు రామమందిరం భూమిపూజ కార్యక్రమంలో పాల్గొంటారు. దేశంలో కొందరికి మాత్రమే ఈ కార్యక్రమానిక ఆహ్వానం అందింది.