ప్రశాంత్ కిషోర్ భవిష్యత్ కార్యాచరణ ప్రకటన సంచలన నిర్ణయం

ప్రశాంత్ కిషోర్ భవిష్యత్ కార్యాచరణ ప్రకటన సంచలన నిర్ణయం

0
92

ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ని జేడీయూ పార్టీ బయటకుపంపింది.. నితిష్ తో ఇక ముందుకు వెళ్లే ఛాన్స్ లేదు అని తేలిపోయింది.. బిహర్ లో చక్రం తిప్పిన ప్రశాంత్ కిషోర్ రాజకీయంగా ఇప్పుడు చర్చకు కారణం అయ్యారు, అయితే నేడు తన రాజకీయ కార్యచరణ ప్రకటిస్తా అని చెప్పారు తాజాగా ఆయన ప్రకటించారు.

తాను బీహార్ లోని ప్రజలందరినీ కలవాలని అందుకోసం బాత్ బీహార్ కీ పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనున్నానని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ వ్యాఖ్యానించారు.. బిహార్ లో నితీశ్, బీజేపీల పొత్తుపైనా సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో పొత్తు పెట్టుకున్నా ఎలాంటి అభివృద్ది ఇక్కడ సాధించలేదు అని అన్నారు,

ఇక గాడ్సేను పూజించే వాళ్లతో ఎలా కలుస్తామని ప్రశ్నించారు. బీజేపీతో చేతులు కలిపిన తరువాత సీఎం నితీశ్ కుమార్ పూర్తిగా మారిపోయారని, కేవలం ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ఆయన పొత్తును కొనసాగిస్తున్నారని, అభివృద్ధిని పక్కనబెట్టారని మండిపడ్డారు. నీతి ఆయోగ్ లెక్కల ప్రకారం అత్యంత వెనుకబడిన రాష్ట్రంగా బీహార్ ఉందని, ఇది ప్రజలకు అవమానం అని అన్నారు పీకే. తనకు తెలిసిన విషయాలు ప్రజలకు చెబుతా అని త్వరలో ప్రజల్లోకి వెళతా అన్నారు. తాను ఎలాంటి కొత్త రాజకీయ పార్టీ పెట్టడం లేదు అని తెలిపారు ఆయన.