దేశంలో ప్రజలకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు ప్రశాంత్ కిశోర్.. రాజకీయ ఎన్నికల వ్యూహకర్తగా ఆయనకు మంచి ఇమేజ్ ఉంది, సీఎంలను పీఎంలను గెలిపించడంలో దిట్ట, మొన్న ఏపీ…నిన్న ఢిల్లీ… రేపు తమిళనాడు, పశ్చిమబెంగాల్….ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో ప్రధాన పార్టీల చూపు ఆయనవైపే ఉన్నాయి, గెలుపు తీరాలకు ఆయన తీసుకువెళుతున్నారు అని పీకేకి ఫ్యాన్స్ అవుతున్నారు.
బీజేపీకి గట్టి షాక్ ఇస్తూ హస్తినలో ఆప్ గెలుపుకి ప్రధాన కర్త అయ్యారు.. ఆయన సొంత రాష్ట్రం బీహార్లో అధికారంలో ఉన్న జేడీయూలో ఆయన గతంలో చేరినా అది ఎక్కువకాలం కొనసాగలేదు. ఇటీవల ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పార్టీ నుంచి ప్రశాంత్ కిశోర్ను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. ఇక ఆయన మరో రాజకీయ పార్టీలో చేరుతారు అని చాలా వార్తలు వినిపించాయి.. హస్తిన ఎన్నికల రిజల్ట్ రోజున ఆయన ప్రకటన చేస్తారు అని అనుకున్నారు.. కాని ఆయన చేయలేదు.
ఈ సమయంలో తాజాగా ఆయన చేసిన ప్రకటన ఆసక్తి రేకెత్తించింది. మీరంతా నేనేం చెబుతానో అని ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారని తెలుసు… 11న ఏమీ ప్రకటించక పోవడంతో నిరాశే చెంది ఉంటారు. ఈనెల 18వ తేదీన మాత్రం బిగ్ అనౌన్స్ మెంట్ చేస్తున్నాను అంటూ మరో ఆసక్తి కలిగించారు, దీంతో 18 కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. జాతీయ పార్టీలతో ఫ్రంట్ ఏర్పాటు చేస్తారేమో అనే ఆలోచన కొందరిలో ఉంది.