పత్రి అనే ప్రాంతంలో సాయి మందిరం ఎందుకు ? సాయిబాబాకి ఆ ప్రాంతానికి సంబంధం ఇదే

పత్రి అనే ప్రాంతంలో సాయి మందిరం ఎందుకు ? సాయిబాబాకి ఆ ప్రాంతానికి సంబంధం ఇదే

0
92

ఇటీవల కొత్తగా ముఖ్యమంత్రిగా వచ్చిన ఉద్దవ్ థాక్రే సర్కార్ షిరిడిలో సాయి మందిరంపై కీలక నిర్ణయం తీసుకుంది, అయితే షిరిడిలా డవలప్ చేయాలని ఆయన జన్మస్ధలం పత్రి అంటూ కీలక ప్రకటన చేశారు ఉద్దవ్….బాబా జన్మస్థలం పాథ్రీ అంటూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే ప్రకటించడంతో చాలా మంది అక్కడ కూడా సాయి మందిరం నిర్మిస్తారు అని అనుకున్నారు. చివరకు పనులు అలాగే సాగుతున్నాయి.

ఇప్పటికే గతవారం ఆ ప్రాంతాన్ని సాయి జన్మస్థలంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు ప్రభుత్వ పెద్దలు.. దీని కోసం రూ.100 కోట్లు కేటాయిస్తామన్నారు.. సీఎం ఉద్ధవ్ థాక్రే నిర్ణయంపై షిరిడీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. పత్రిని అభివృద్ధి చేస్తే షిర్డీ ప్రాముఖ్యం తగ్గిపోతుందని ఆందోళన వ్యక్తం చేసింది.. అయినా సర్కారు ఈ నిర్ణయంతో ముందుకు వెళుతోంది.

అయితే అసలు ఈ ప్రాంతం ఎక్కడ ఉంది. ఆ ప్రాంతం గురించి కొన్ని కీలక విషయాలు చూద్దాం.. నిజానికి, మరాఠ్వాడా ప్రాంతంలో షిరిడీకి 275 కిలోమీటర్ల దూరంలో పర్భణీ జిల్లాలోని పత్రి అనే ఊరు ఉంది, ఇది కూడా సాయి భక్తులు చాలా మంది సందర్శించే ప్రాంతం.. ఇది సాయిబాబా జన్మస్థలమన్న ప్రచారం ఎప్పటినుంచో ఉంది… 1854లో 16 ఏళ్ల వయసులో సాయి ఇక్కడ నుంచి షిరిడీకి వచ్చారని, ఇక్కడే ముందు ఓ వేపచెట్టు కింద సాయిబాబా కనిపించారని భక్తులు అంటారు. అందుకే ఇక్కడ అసలైన సాయి మందిరం నిర్మించాలి అని సర్కారు భావిస్తోంది.