ప్ర‌తిప‌క్షంపై స‌టైర్లు వేసిన ఆర్ధిక మంత్రి బుగ్గ‌న

ప్ర‌తిప‌క్షంపై స‌టైర్లు వేసిన ఆర్ధిక మంత్రి బుగ్గ‌న

0
118

ఏపీలో ఈ కోవిడ్ వైర‌స్ పై ప‌రీక్ష‌లు ఎక్కువ జ‌రుగుతున్నాయి అని, దేశంలో ఎక్కువ టెస్టులు చేస్తున్న స్టేట్ కూడా ఏపీ అని తెలిపారు ఆయ‌న ..ఇప్పటి వరకు లక్షా 2వేల 460 మందికి పరీక్షలు నిర్వహించాం. ఏపీలో పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నట్లుగా ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తోంది. మ‌నం చేసే టెస్టుల బ‌ట్టీ కేసుల సంఖ్య చూడాలి.

కాని కొన్ని మీడియాలు కావాలి అని దీనిని దుష్ప్ర‌చారం చేస్తున్నాయి అని విమ‌ర్శించారు ఆయ‌న..‌
ఏపీలో కరోనాతో ఇబ్బందిపడుతున్న వారికి టీడీపీ నేతలెవరూ సహాయం చేయలేదు. చంద్రబాబు మాత్రం ఆయన ఎల్లోమీడియా ద్వారా రాజకీయ విమర్శలు చేస్తున్నారు అని విమ‌ర్శించారు.

ఇక ఇప్ప‌టికే స్టేట్ లో చాలా మంది కోలుకుని డిశ్చార్జ్ అవుతున్నారు అని తెలిపారు, ఇక వైర‌స్ గురించి సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేసిన కామెంట్ల పై కూడా రాజ‌కీయ విమర్శ‌లు చేస్తున్నార‌ని , అస‌లు
కరోనాతో సహజీవనం తప్పదని డబ్ల్యూహెచ్‌వోనే చెప్పింది. ఫేస్‌ మాస్కులు జీవితంలో భాగమని ప్రధాని మోదీ అన్నారని తెలిపారు మంత్రి రాజేంధ్ర‌‌‌నాథ్ రెడ్డి.