ప్రయాణికులకి గుడ్ న్యూస్ ఏఏ రూట్లో ఎన్ని బస్సులు తిరుగుతాయంటే

ప్రయాణికులకి గుడ్ న్యూస్ ఏఏ రూట్లో ఎన్ని బస్సులు తిరుగుతాయంటే

0
102

తెలంగాణ, ఏపీఎస్ ఆర్టీసీల మధ్య ఒప్పందం కుదిరింది, మొత్తానికి బస్సులు రోడ్లు ఎక్కాయి, దీంతో ప్రయాణికుల కష్టాలు తీరాయి అనే చెప్పాలి, అయితే తెలంగాణ అధికారుల ప్రతిపాదనల మేర ఏపీ అన్నింటికి ఒప్పుకుంది, తెలంగాణ ఆర్టీసీకి చెందిన బస్సులు అత్యధికంగా విజయవాడ, కర్నూలు రూట్లలో తిరగనున్నాయి.

మరి ఏఏ రూట్లు ఎన్ని బస్సులు అనేది ఓ సారి చూద్దాం…విజయవాడ రూట్ లో మొత్తం 273 టీఎస్ఆర్టీసీ బస్సులు తిరుగుతాయి అని తెలిపారు అలాగే కర్నూలు రూట్ లో 213 బస్సులు తిరుగుతాయి.. పిడుగురాళ్ల – గుంటూరు రూట్ లో 67 బస్సులు ఇక మాచర్ల రూట్ లో 66 బస్సులు తిరుగుతాయి.

అలాగే కృష్ణాలో నూజివీడు, తిరువూరు, భద్రాచలం రూట్ లో 48 బస్సులు , ఖమ్మం, జంగారెడ్డి గూడెం రూట్ లో 35 బస్సులు శ్రీశైలం రూట్లో 62 బస్సులు సత్తుపల్లి, ఏలూరు రూట్ లో 62 బస్సులు తిరుగుతాయి. రిజర్వేషన్ సౌకర్యాలు కూడా కల్పించబోతున్నారు.