ప్రయాణికుల కోసం ఆర్టీసీ మరో కీలక డెసిషన్

ప్రయాణికుల కోసం ఆర్టీసీ మరో కీలక డెసిషన్

0
130

దేశంలో అన్నీ రాష్ట్రాల్లో కూడా ఆర్టీసీ బస్సులు నడుస్తున్నాయి, పరిమిత సర్వీసులు మాత్రమే ఆర్టీసీ నడుపుతోంది.. అయితే ఈ వైరస్ భయంలో చాలా మంది నగదు లావాదేవీల కంటే ఆన్ లైన్ లావాదేవీలు చేస్తున్నారు, అందుకే టీఎస్ఆర్టీసీ టికెట్లు ఇచ్చే విధానంలో మార్పులు చేసి కొత్త పద్దతిని అమలు చేయనుంది.నేరుగా డబ్బులు తీసుకోవడం, టిక్కెట్లు ఇవ్వడం కాకుండా ఈ విధానం.

ఇక గూగుల్ పే, ఫోన్పే, పేటీఎం ద్వారా ప్రయాణికులు టికెట్ చార్జీలను చెల్లించేలా టీఎస్ఆర్టీసీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
అంతేకాదు ఇప్పటికే సక్సెస్ ఫుల్ గా కర్ణాటకలో క్యూఆర్కోడ్ విధానం అమలు అవుతోంది, అది కూడా ఇక్కడ అమలు చేయడానికి పూర్తి ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు.

ఈ విధానంలో క్యూఆర్కోడ్ ఆధారంగా టికెట్ కు సరిపడా డబ్బులను చెల్లించవచ్చు. ఇక దూర ప్రాంతాలకు వెళ్లేవారు ఇలా చెల్లింపులు చేయవచ్చు, తాజాగా దీనిపై ఆర్టీసీ అధికారులు ఆలోచన చేస్తున్నారు. ఇది అమలు చేస్తే మంచిది అని ప్రజలు కూడా కోరుతున్నారు.