మామూలుగా చికెన్ ధరలు మా అంటే కేజీకి రూ.200 ఉంటుంది. లేదంటే 250 మహాఅయితే 300 ఉంటుంది. కానీ ఆ శ్రీలంకలో చికెన్ రేట్ తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే. రూ.200 కాదు కిలో చికెన్ ధర ఏకంగా రూ.1000 అయింది. అలాగే కోడిగుడ్డు ఒకటి రూ.35, లీటర్ పెట్రోల్ రూ.283, లీటర్ డీజిల్ రూ.220గా ఉంది. కిలో ఉల్లి రూ.200, పాలపొడి రూ.1,945, దీనితో శ్రీలంకలో 90 శాతం హోటళ్లు మూతపడ్డాయి. శ్రీలంకలో ఆహార, ఆర్థిక సంక్షోభం తీవ్రస్థాయికి రావడంతో ఈ ధరలు పెరిగాయి.