ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ దోచుకుంటున్నారు: పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి

0
80

నిత్యవసర ధరల పెరుగుల, సామాన్యుడిపై భారాన్ని నిరసిస్తూ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్ర చేపట్టారు. చేవేళ్ల మండలం ముడిమ్యాల అంబేద్కర్ విగ్రహం నుంచి పాదయాత్రగా రేవంత్ రెడ్డి బయలుదేరాడు. పాదయాత్రకు ముందు చిలుకూరు బాలజీని రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు. ఈ పాదయాత్రకు మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ సంఘీభావం తెలిపారు.

ఈ సందర్బంగా కేంద్ర ప్రభుత్వంపై రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. మోడీ ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని అధికారంలోకి వచ్చారు. అంటే ఇప్పటికి 14 కోట్ల ఉద్యోగాలు రావాలి. పెట్రోల్ లీటరుకు 60 రూపాయలు, గ్యాస్ 400 సిలిండర్ ఉంది. మిగతా అంత కేసీఆర్, మోడీలు దోచుకుంటున్నారు. 400 ఉన్న సిలెండర్ వెయ్యి రూపాయలు చేశారు. 30 లక్షల కోట్ల రూపాయలు పన్నుల రూపంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దోచుకున్నాయి. పండించిన పంటలకు ధరలు లేవు.. అమ్మబోతే అడవి, కొనపోతే కొరివి అయ్యింది.

వడ్ల కుప్పల మీదనే రైతులు ప్రాణాలు విడుస్తున్నారు. లక్ష కోట్లు ఖర్చు పెట్టి కేసీఆర్ కాళేశ్వరం కట్టినా అంటున్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టు డిజైన్ చేస్తే చేవెళ్లను తొలగించి ఇక్కడ రైతులకు అన్యాయం చేసారు. కాంగ్రెస్ నుంచి గెలిచి. పార్టీ మారిన వాళ్ళు అభివృద్ధి కోసం పార్టీ మారినం అంటున్నారు. వాళ్ళను ఎక్కడికక్కడ నిలదీయాలి. ఢిల్లీలో అగ్గి పుట్టిస్తామని కేసీఆర్ అన్నాడు. అగ్గి పుట్టియ్యలేదు కానీ ఫామ్ హౌస్ లో పండుకొని పెగ్గు తాగిండు. రైతుల వడ్లు కొనే వరకు కాంగ్రెస్ పోరాటం కొనసాగుతుంది. కాంగ్రెస్ కు ప్రజలంతా అండగా ఉండాలని కోరారు.