ఉక్రెయిన్ దేశంపై రష్యా యుద్ధం ప్రారంభించి ఆరు రోజులు అవుతుంది. ఈ యుద్ధంలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్న యుద్ధం మాత్రం ఆపడం లేదు. తాజాగా పుతిన్ యుద్ధం అప్పడానికి ఒప్పుకున్నారు. అవును నిజమే. ఉక్రెయిన్ లోని ఖార్కివ్ లో చిక్కుకున్న భారతీయుల కోసం ప్రధాని మోడి.. పుతిన్ కు ఫోన్ చేశారు. ఖార్కివ్ లో ఉన్న భారతీయులను తరలించడానికి సాయం చేయాలని కోరారు. దీనికి పుతిన్ సానుకూలంగా స్పందించారు. అంతే కాకుండా ఖార్కివ్ లో దాదాపు 6 గంటల పాటు యుద్ధం ఆపాలని అక్కడ ఉన్న బలగాలకు కూడా ఆదేశాలు జారీ చేశారు. ఖార్కివ్ లో ఉన్న భారతీయులు అందరూ 6 గంటల్లో ఖాళీ చేయాలని సూచించారు.