BIG BREAKING: ప్రధాని మోడీకి తప్పిన పెను ప్రమాదం

0
62

ప్రధాని నరేంద్ర మోడీకి పెను ప్రమాదం తప్పింది. ఇవాళ ఏపీలో పర్యటిస్తున్న ప్రధాని హెలికాఫ్టర్ లో గన్నవరం నుండి భీమవరం వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు నల్ల బెలూన్లు వదిలారు. ఎయిర్ పోర్టుకు 2 కిలో మీటర్ల దూరంలో డజన్ల బెలూన్లను వదిలివేశారు.  ఒకవేళ బెలూన్లు హెలికాఫ్టర్ కు తగిలితే పెను ప్రమాదం జరిగేదని తెలిపారు. అయితే రాష్ట్రంలో ప్రధాని పర్యటనను రాష్ట్ర కాంగ్రెస్‌, ఎంఆర్‌పీఎస్‌ నాయకులు వ్యతిరేకిస్తున్నారు. విమానాశ్రయానికి సమీపంలోనే ఇలాంటి ఘటన జరుగడం పట్ల రాష్ట్ర పోలీసులు సీరియస్‌గా తీసుకుని విచారణను ప్రారంభించారు. ఈ ఘటనతో పోలీసులు, అధికారుల వైఫల్యం బయటపడింది.