జీవితంలో ఈ ఐదుగురిని అస్సలు నమ్మవద్దు – చాణుక్యుడు

Principles of Chanakya ethics

0
108
chanakya

చాణుక్యుడు చెప్పిన అనేక సూత్రాలు నేటికి మన దేశంలో చాలా మంది ఫాలో అవుతున్నారు. చాణుక్యుడు గొప్ప పండితుడు అనే విషయం తెలిసిందే ఆయన చంద్రగుప్తుని ఆస్థానంలో ప్రధానమంత్రి గా చేశారు. నీతిశాస్త్రం రచించారు. మన జీవితంలో ఏ కష్టాలు లేకుండా ఉండాలంటే ఆయన చెప్పిన నీతి సూత్రాలు ఫాలో అయితే మంచిది.

అయితే మనలో చాలా మంది తప్పులు చేస్తారు. ఆ తప్పులు సరిదిద్దుకునే వారు కొందరు అయితే వాటిని అస్సలు సరిదిద్దుకోని వారు ఇంకొందరు.. చాణుక్యుడు ఇలాంటి వారి విషయంలో కొన్ని సూత్రాలు చెప్పారు.

  1. ఎవరైనా తప్పు చేసినా ఆ తప్పుని ఒప్పుకుంటే మంచిది దానిని ఒప్పుకోకుండా మరో తప్పు చేస్తే వారిని ఎట్టిపరిస్దితిలో నమ్మవద్దు.

2.  నీ నుంచి ఎప్పుడూ నగదు ఖర్చు చేయాలి అని భావించే వారిని అస్సలు నమ్మవద్దు

3. ఒకసారి తప్పు చేసిన వ్యక్తిని నువ్వు క్షమించినా, మళ్లీ ఆ వ్యక్తి తప్పు చేస్తే నమ్మక ద్రోహం చేస్తే ప్రాణం పోయే వరకూ అతనిని నమ్మకూడదు

4. మాట మీరే వారిని అస్సలు నమ్మవద్దు ఈ స్నేహం కూడా చేటు చేస్తుంది

5. చంచలమైన స్త్రీలను కూడా నమ్మకూడదు వీరి వల్ల ఎంతో ప్రమాదం