రేపు హైదరాబాద్ కు ప్రియాంకా గాంధీ..కొడుకు కోసం అక్కడికి..

Priyanka Gandhi to visit Hyderabad tomorrow

0
89

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ రేపు హైదరాబాద్‌ రానున్నారు. తన కుమారుడు రైహాన్‌కు చికిత్స నిమిత్తం ఆమె నగరానికి వస్తారని కాంగ్రెస్‌ వర్గాలు తెలిపాయి. గతంలో ఎల్వీ ప్రసాద్‌ కంటి ఆస్పత్రిలో ప్రియాంక కుమారుడికి పరీక్షలు చేయించారు. ఈ నేపథ్యంలో మరోసారి చికిత్స కోసం రేపు రానున్నారు. ప్రియాంక గాంధీ పర్యటన పూర్తిగా వ్యక్తిగతమని, అందువల్ల కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలెవరూ ఆమెను ఇబ్బంది పెట్టొద్దని టెన్ జన్‌పథ్ వర్గాల నుంచి ఆదేశాలు వచ్చినట్లు తెలుస్తోంది.