తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన అగ్రహీరో పవన్ కళ్యాణ్ గతంలో ఆయన సినీ జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టి రాజకీయాల్లోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే… జనసేన పార్టీని స్థాపించి ఏపీ ప్రత్యక్ష రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు…
పవన్ రాజకీయాల్లోకి వచ్చినా కూడా ఆయన క్రేజ్ మాత్రం తగ్గలేదు… కోట్లాది మంది అభిమానులు ఆయన వెంటే ఉన్నారు… ఈ నేపథ్యంలో పవన్ భక్తుడుగా పిలువబడే ప్రముఖ నిర్మాత నటుడు బండ్లగణేష్ సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్ట్ చేశాడు.. ఇప్పుడు ఆయన చేసిన పోస్ట్ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది…
పవన్ ఎప్పుడో అన్న మాటను తాజాగా గణేష్ దాన్ని పోస్ట్ చేశాడు… అందులో నేను భయంతో రాలేదు బాధ్యతతో వచ్చాను అన్న లైన్ ఉంది ఇది నిజం అంటూ పవన్ ను కూడా ట్యాగ్ చేశారు గణేష్ చాలా రోజుల తర్వాత గణేష్ మళ్లీ పవన్ కు జైకొట్టడం వేనుక కారణం ఏంటని అందరు అనుమానిస్తున్నారు….. ఆయన జనసేన పార్టీలో చేరేందుకు సిద్దమయ్యారని అందరు అనుమానిస్తున్నారు…ప్రస్తుతం గణేష్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు…