మహబూబాబాద్ ఆర్టీఓ ఆఫీసు ముందు ఆటో డైవర్ల నిరసన

0
90

తెలంగాణ రాష్ట్రం మహబూబాబాద్ జిల్లాలోని ఆటో డ్రైవర్లపై ఆర్టీవో అధికారుల వేధింపులు ఆపాలని నిరసనకు దిగారు. చెకింగ్ ల పేరుతో కార్మికులపై ఫైన్లు వేయడానికి వెంటనే మానుకోవాలని కోరుతూ బుధవారం సిఐటియు అనుబంధ ఆటో డ్రైవర్స్ యూనియన్ ఆధ్వర్యంలో స్థానిక నర్సంపేట బైపాస్ రోడ్డు నుండి ఆటోల ద్వారా ర్యాలీ నిర్వహించి ఆర్టీవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎం.వి.ఐ రమేష్ రాథోడ్ కు వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం సిఐటియు జిల్లా కార్యదర్శి ఆకుల రాజు మాట్లాడుతూ..ఆటో డ్రైవర్లు అనేక రకాల సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని, చదువుకున్న నిరుద్యోగులకు ఆసరాగా ఉన్న ఆటోలు నేడు సరైన ఆదాయం దొరకడం లేదని తెలిపారు. ఆర్టీవో అధికారులు ఆటో డ్రైవర్లను చెకింగ్ ల పేరుతో నిలుపుదల చేసి వేలాది రూపాయల ఫైన్లు వేసి వేస్తున్నారని, దానితో ఆటో డ్రైవర్లు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఆటో డ్రైవర్లు 15 రోజులు సంపాదించిన అంతా ఫైండ్ల రూపేనా కట్టాల్సి వస్తుందని తెలిపారు.

ఒకవైపు పెట్రోలు డీజిల్ రేట్లు పెరిగి భారం అవుతున్న ఈ రోజుల్లో అధిక భారాలతో బతకలేని పరిస్థితి ఉందని తెలిపారు. ఆర్టీవో అధికారులకు ఆర్టీసీ కార్మికులు సహకరించడం తగదని, ఆర్టీసీ ఆదాయాన్ని పెంచుకోవడం కోసం వారు చేసే ప్రయత్నం చేయాలి కానీ ఆటో డ్రైవర్ల పొట్ట కోట్ట వద్దని కోరారు. ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం సంక్షేమ చట్టాన్ని ఏర్పాటు చేయాలని లైసెన్స్ విధానాన్ని సరళీకరించాలని కోరారు. 2019 రవాణా చట్టం డ్రైవర్ల పాలిటీ శాపంగా ఉందని దాని వెంటనే మార్చి డ్రైవర్లను ఆదుకోవాలని రాజు కోరారు.

ఈ కార్యక్రమంలో సిఐటియు పట్టణ కన్వీనర్ కుమరకుంట్ల నాగన్న నాయకులు తోట శ్రీనివాస్, ఎర్ర శ్రీనివాస్ ఆటో డ్రైవర్స్ యూనియన్ జిల్లా నాయకులు గాడిపెళ్లి శ్యామ్, దర్గయ్య, లింగయ్య, పాషా తదితరులు పాల్గొన్నారు.