వైయస్ కుటుంబానికి కంచుకోటగా ఉన్న ప్రాంతం పులివెందుల.. జగన్ ని వైయస్ రాజశేఖర్ రెడ్డిని సీఎం చేసిన ప్రాంతం. అయితే తాగునీటి సమస్య, రైతులకి సమస్య లేకుండా అద్బుతమైన పట్టణంగా పులివెందులని చేయడానికి సంకల్పించారు సీఎం జగన్, ఏపీలో పులివెందుల మోడల్ టౌన్ గా చేయడానికి పక్కా ప్రణాళిక రచిస్తున్నారు అధికారులు.. పులివెందుల ఏరియా డెవలప్‌మెంట్ ఏజెన్సీ (పాడా) పై సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు కూడా. వరాల జల్లు కురిపించారు ఓసారి చూద్దాం
1.. పులివెందులలో 30 కోట్లతో 13 ఆరోగ్య కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించనున్నారు
2. 7 గొడౌన్లు, ఒక కోల్డ్ స్టోరేజ్ పులివెందులలో ఏర్పాటు చేయనున్నారు.
3..పులివెందుల శిల్పారామానికి సుమారు రూ. 10 కోట్లతో అభివృద్ది పనులు
4. 50 కోట్ల రూపాయలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాటు చేయనున్నారు పులివెందుల పట్టణంలో
5.వేంపల్లిలో కొత్త ఫైర్ స్టేషన్ బిల్డింగ్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్
6.. అలాగే వేంపల్లిలో మిని శిల్పారామం ఏర్పాటు చేయనున్నారు
7. జిల్లాలో పర్యాటక ప్రాంతాలను కలుపుతూ టూరిజం ఏర్పాటు చేయనున్నారు
8. వైయస్సార్ ఘాట్, గండి ఞంటిమిట్ట కు మరింత సౌకర్యాల కల్పన
9..వేంపల్లిలో కొత్త ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
10. పులివెందులలో ఏ సమస్య ఉన్నా పరిష్కరించే విధంగా కమిటి వర్క్ చేయనుంది.