పులివెందుల సతీష్ రెడ్డి వైసీపీలోకి

పులివెందుల సతీష్ రెడ్డి వైసీపీలోకి

0
119

కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం తరపున సతీష్ కుమార్ రెడ్డి తెలుగుదేశం పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్నారు… ఆయన వైఎస్ కుటుంబానికి ప్రత్యర్థిగా ఉన్నారు… అనేక సార్లు వైఎస్ కుటుంబంపై పోటీ చేసి ఓటమి చెందారు… ఇప్పుడు ఈయన కూడా వైసీపీలో చేరేందుకు సిద్దమయ్యారని వార్తలు వస్తున్నాయి… వైసీపీలో చేరే విషయమై తన అనుచరులతో సమావేశం అయిన తర్వాత తన నిర్ణయం ప్రకటిస్తారని తెలుస్తోంది…

అన్ని కుదిరితే కరోనా తగ్గిన తర్వాత సతీష్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్థం తీసుకునేందుకు సిద్దమయ్యారని వార్తలు వస్తున్నాయి… సతీష్ కుమార్ రెడ్డి వైసీపీలో చేరితే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు బిగ్ షాక్ అనే చెప్పాలి ఎందుకంటే కడప జిల్లాలో సతీష్ రెడ్డి టీడీపీకి పెద్ద దిక్కుగా ఉన్నారు..

ఆయన కూడా జంప్ చేస్తే జిల్లాలో పార్టీ ఆఫీస్ కు తాళం వేయకు తప్పదు.. సతీష్ తర్వాత బలమైన నేతలుగా ఉన్న సీఎం రమేష్ ఆదినారాయణ రెడ్డి వంటి వారు కూడా బీజేపీలోకి జంప్ చేసిన సంగతి తెలిసిందే…