Flash: పంజాబ్ సీఎం సంచలన నిర్ణయం..ఏకంగా తన నెంబరే ఇచ్చి

0
69

పంజాబ్ నూతన సీఎం భగవంత్ మాన్ సంచలన ప్రకటన చేశారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన మరునాడే తన మార్క్ నిర్ణయం తీసుకున్నాడు. రాష్ట్రంలో అవినీతిని అరికట్టేందుకు సంచలన నిర్ణయం తీసుకున్నారు. అవినీతి నిరోధానికి ఏకంగా తన వాట్సాప్ నెంబరే హెల్ప్ లైన్ నెంబర్ గా ఇచ్చి ఫిర్యాదులు చేయవచ్చని వెల్లడించారు. మార్చి 23 షహీన్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ యాంటీ కరప్షన్ హెల్ప్ లైన్ నెంబర్ ని అందుబాటులోకి తెస్తామని వెల్లడించారు.  ఎవరైనా మీ నుండి లంచం డిమాండ్ చేస్తే, తిరస్కరించవద్దు, వీడియో/ఆడియో రికార్డింగ్ చేసి హెల్ప్ లైన్ నంబర్‌కు పంపండి. నా కార్యాలయం దర్యాప్తు చేస్తుంది. ఏ దోషిని విడిచిపెట్టదని సీఎం భగవంత్ మాన్ హెచ్చరించారు.