పుష్ప శ్రీవాణి జీతం పెంచిన జగన్

పుష్ప శ్రీవాణి జీతం పెంచిన జగన్

0
95

గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పాముల పుష్ప శ్రీవాణి విషయంలో సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది….ఆమె ఉంటున్న అద్దే ఇంటికి ప్రస్తుతం ప్రతీ నెల లక్ష రూపాయాలను మంజూరు చేసింది… అతి చిన్న వయస్సులో ఆమె మంత్రి అయ్యారు…..

మంత్రి అయిన తర్వాత పుష్ఫ శ్రీవాణి విజయవాడలోని వివేకానంద కాలనీలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుంటున్నారు… తాజాగా ఆ ఇంటి అద్దెకు లక్ష అలాగే అలవెన్సుగా మరో 5 వేలను మంజూరు చేస్తూ ఉత్తర్వులను జారీ చేసింది… కాగా ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాకు చెందిన పుష్ప శ్రీవాణి గతంలో ఉపాధ్యాయ వృత్తిలో పని చేశారు… భ‌ర్త ప్రోత్సాహంతో ఉపాధ్యాయ వృత్తి వీడి రాజ‌కీయాల్లోకి వచ్చింది.

2014 సార్వత్రిక ఎన్నికల్లో కురుపాం నియోజకవర్గం నుంచి వైసీపీ త‌రుపున పోటీ చేసి 19083 ఓట్ల మెజార్టీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. 2019 ఎన్నిక‌ల్లో టీడీపీ అభ్యర్థి పై 26602 ఓట్ల మెజార్టీతో గెలిచారు. జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో అడుగుపెట్టారు…