పుట్టిన రోజు సందర్భంగా బాలయ్యను భారీ కోరిక కోరిన నారాలోకేశ్…

పుట్టిన రోజు సందర్భంగా బాలయ్యను భారీ కోరిక కోరిన నారాలోకేశ్...

0
99

తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరో టీడీపీ హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు నేడు… ఆయన పుట్టిన రోజు వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా నందమూరి అభిమానులు ఘనంగా నిర్వహిస్తున్నారు… పలువురు సోషల్ మీడియా ద్వారా విషెస్ చెబుతున్నారు… ఈ క్రమంలో టీడీపీ నేత నారాలోకేశ్ కూడా బాలయ్యకు శుభాకాంక్షలు చెప్పారు…

ఈమేరకు ట్వీట్ కూడా చేశారు… అందరికీ ఆయన బాలయ్య. నా ఒక్కడికీ ఆయన ముద్దుల మావయ్య. రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా తనను నమ్ముకున్న వారికి అండగా నిలిచే కథానాయకుడు ఆయన. బాలా మావయ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు మరియు షష్టిపూర్తి మహోత్సవ అభినందనలు

నిన్న బాలా మావయ్య కొత్త సినిమా టీజర్ చూసాను. చాలా ఎనర్జిటిక్ గా కనిపించారు. మావయ్యా… మీరు మరెన్నో చిత్రాల్లో నటించి… మీ అభిమానులకు ఎప్పటిలాగే సంచలన విజయాలను కానుకగా ఇవ్వాలని మనసారా కోరుకుంటున్నాను