కొందరు ఎంత దారుణంగా బిహేవ్ చేస్తారంటే జంతువులని కూడా దారుణంగా హింసిస్తారు, ఇలా పైశాచిక ఆనందం పొందుతారు.. ముంబైలో జరిగిన ఓ ఘటన షాక్ కి గురిచేసింది.. ఎవరికి అయినా పాముని చూస్తే భయం, ఎవరైనా భయపడతాం… అక్కడ పాము ఉంది అంటే వెంటనే మనం అక్కడ నుంచి కిలోమీటర్ దూరం పారిపోతాం … అయితే ఇక్కడ ఎవరు చేశారో కాని పాము విషయంలో దారుణమైన పని చేశారు.
కండీవాలీ ఈస్ట్లోని మీడోస్ హౌసింగ్ సొసైటీలో ఓ వ్యక్తికి కదల్లేని స్థితిలో ఉన్న పాము కనిపించింది. తీరా దగ్గరకు వెళ్లి చూస్తే ఆ పాము తలకి వాడిపడేసిన కండోమ్ తగిలించి ఉంది, వెంటనే స్నేక్ హెల్ప్లైన్కు కాల్ చేశారు… వారు అక్కడకు వచ్చి ఆ పాము తలకు ఉన్న కండోమ్ తీశారు..
అయితే ఇది కావాలి అని తగిలించిందే అంటున్నారు వారు… పాములు ఇలాంటి ముడుచుకున్న వాటిలో తల దూర్చవు కావాలి అని ఎవరో ఇలా చేశారు అని అన్నారు, కండోమ్ తలకు ఉండిపోవడంతో ఊపిరి ఆడక చాలా ఇబ్బంది పడింది… చివరకు దానిని అడవుల్లో వదిలిపెట్టారు.