పెళ్లి ట్రెండ్ మొత్తం మారిపోయింది.. టెక్నాలజీ మయం అయిపోయింది ..ఇప్పటికే చాలా వరకూ పెళ్లి పత్రికలు తగ్గిపోయాయి, అంతా డిజిటల్ లో ఇన్విటేషన్ పంపుతున్నారు, ఇక అంతా డిజిటల్ మయం కావడంతో అన్నీ క్షణాల్లో జరుగుతున్నాయి, అయితే ఇటీవల కరోనా సమయంలో ఏకంగా పెళ్లి కార్డులు లేకుండా డిజిటల్ ఇన్విటేషన్ పెళ్లి లైవ్ కూడా చూపించారు.
ఇక పెళ్లి భోజనాలు కూడా బాక్సుల రూపంలో ఇంటికి డెలివరీ చేశారు, ఇలా అనేక రకాల కొత్త పద్దతులు చూశాం, ఈసారి ఈ పెళ్లిలో చేసింది చూసి అందరూ షాక్ అయ్యారు, పెళ్లి అంటే కట్నాలు కానుకలు ఉంటాయి, వచ్చిన వారు గిఫ్ట్ లేదా కట్నం చదవిస్తారు, నాటి నుంచి నేటికి ఇది సంప్రదాయంగా ఉంది.
అయితే ఇప్పుడు నగదు ఇవ్వక్కర్లేదు గూగుల్ పే ఫోన్ పే ఇలా పే చేస్తున్నారు అన్నీ చోట్లా ఇది పెళ్లి కట్నాలకు వచ్చింది, తమిళనాడులోని మధురైలో ఓ పెళ్లి జంట వైరటీగా పెళ్లి పత్రిక పైన క్యూఆర్ కోడ్ ను ముద్రించారు. గూగుల్ పే, ఫోన్ పే క్యూఆర్ కోడ్లను ఆ పత్రిపై ప్రింట్ చేశారు. ఇక ఎవరైనా బంధువులు పెళ్లికి వచ్చిన వారు నగదు ఇలా ఆన్ లైన్ లో పంపవచ్చు, ఈ పెళ్లి పత్రిక సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.