తన వెనుక ఎవరున్నారో చెప్పేసిన ఎంపీ రాఘురామ కృష్ణంరాజు…

తన వెనుక ఎవరున్నారో చెప్పేసిన ఎంపీ రాఘురామ కృష్ణంరాజు...

0
96

అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు వ్యవహారం రోజుకు ఒక మలుపు తిరుగుతోంది… నిన్న ఆయనపై అనర్హత వేటు వేసేందుకు వైసీపీ ఎంపీలు ఏపీ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లి స్పీకర్ కు ఫిర్యాదు చేశారు… దీనిపై రఘురామకృష్ణం రాజు స్పందించారు… తాను పార్టీ అధినేతను పార్టీని ఇప్పటికీ ప్రేమిస్తున్నానని అన్నారు…

తాను పార్టీని పార్లమెంటును వదిలేది లేదని స్పష్టం చేశారు… ఎంపీలు ఇచ్చిన ఆధారాలతో తనపై అనర్హత వేటు కుదరదని తన లోక్ సభ సభ్యతం రద్దు చేయడం ఎవరి వల్లకాదని అన్నారు.. తన వెనుక ఎవరో ఉన్నారని ప్రచారం చేస్తున్నారని అందులో నిజం లేదని అన్నారు… తాను వెంకటేశ్వర స్వామిని నమ్ముకున్నానని అన్నారు…

తన వెనుక ఎవ్వరు లేరని స్పష్టంచేశారు… తన వెనుక బీజేపీ ఉందని చెప్పే ధైర్యంలేక చంద్రబాబు నాయుడు పార్టీ పేరు చెబుతున్నారని అన్నారు… ఈ ఏపీసోడ్ లో ముందు ఎమ్మెల్యేలతో మాట్లాడించారని ఆతర్వాత రాజీనామా చేయాలని అన్నారు.. ఆతర్వాత రాజీనామా చేయాలని సవాల్ చేశానని గుర్తు చేశారు ఎంపీ రఘురామ కృష్ణం రాజు…