నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు హాట్ కామెంట్స్

నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు హాట్ కామెంట్స్

0
91

ఏపీ రాజకీయాల్లో రాజుగారి రాజకీయం పెద్ద చర్చకు కారణం అవుతోంది.. తెలుగుదేశం పార్టీ కాదు ఈసారి రాజుగారు వైసీపీ నుంచి బీజేపీలో చేరుతారు అని వార్తలు వైరల్ అయ్యాయి.. ఆయనే నరసాపురం ఎంపీ
రఘురామకృష్ణం రాజు అయితే ఆయన పార్టీ మారేది లేదు అని క్లారిటీ ఇచ్చారు.. కాని గోకరాజు ఫ్యామిలీ వైసీపీలో చేరడంతో ఈ వ్యాఖ్యలకు మరింత బలం చేకూరింది.

బీజేపీకి సన్నిహిత సంబంధాలు నెరపడం వైసీపీ అధిష్టానానికి ఆగ్రహం తెప్పిస్తుందన్న వాదన వినిపిస్తోంది. అసలు ఈ ఎంపీ రఘురామకృష్ణంరాజు కేంద్రంలోని బీజేపీ పెద్దలతో సన్నిహిత సంబంధాలు నెరుపుతున్నారు అని కామెంట్లు వస్తున్నాయి .అయితే ఆయనకు పాత పరిచయాలు ఉన్నాయి కాబట్టి ఆయన మీట్ అవుతున్నారు అంటున్నారు.

తాజాగా మరోసారి క్లారిటీ ఇచ్చారు రాజుగారు.. తాను వైసీపీలోనే ఉంటానని.. బీజేపీలో చేరనని ప్రకటించారు. వైఎస్ జగన్ తనను ఏమాత్రం అనుమానించడం లేదని మీడియా సృష్టియేనని తెలిపారు.ఇక తాను ఏ పార్టీలోనూ శాశ్వత సభ్యత్వం తీసుకోలేదని.. ఎన్ని పార్టీలు మారినా ఎంపీగా గెలిచేందుకే అంటూ రఘురామకృష్ణం రాజు హాట్ కామెంట్స్ చేశారు. అయితే ఆయన మాట బాగానే ఉంది మరి వచ్చే రోజుల్లో కూడా ఆయనే అదేస్టాండ్ లో ఉంటారా అనేది చర్చ.