కాంగ్రెస్ అధ్యక్ష పీఠంపై రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు

0
214

కాంగ్రెస్ అధ్యక్ష పీఠం ఎవరిది? ఇప్పుడు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త నుండి అగ్ర నాయకుల మదిలో మెదులుతున్న ప్రశ్న. అధ్యక్ష పదవికి సోనియా గాంధీ రాజీనామా చేయడం, రాహుల్ గాంధీ మొగ్గు చూపకపోవడంతో ఎన్నిక అనివార్యమైంది. ఇప్పటికే పలుసార్లు రాహుల్ గాంధీ బహిరంగంగానే నేను పోటీ చేయనని స్పష్టం చేశారు. అయితే ఈసారి అధ్యక్ష పదవి గాంధీయేతర కుటుంబానికి దక్కుతుందా? లేదా రాహుల్ గాంధీ మనసు మార్చుకొని అధ్యక్ష పీఠం అధిరోహిస్తారా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ఇక తాజాగా రాహుల్ గాంధీ మరోసారి కాంగ్రెస్ అద్యక్ష పదవిపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఉదయపూర్ లోని చింతన్ శిబిర్ లో తీసుకున్న నిర్ణయం ‘ఒకే వ్యక్తి ఒకే పదవి’ అనే నిర్ణయానికి కట్టుబడి ఉన్నాం. కాంగ్రెస్ అధక్ష పీఠం ఒక సంస్థాగత పదవే కాదు. సైద్ధాంతిక, నమ్మకమైన వ్యవస్థ. ఆ పదవి ఆలోచన సమూహం అన్నారు. మీరు చారిత్రాత్మక స్థానంలో అడుగు పెట్టబోతున్నారు. ఆ స్థానం దేశ ఆకాంక్షను ప్రతిబింబించింది. ఇకపై ప్రతిబింబిస్తుదని అన్నారు.

అయితే అసలు కాంగ్రెస్ అధ్యక్ష పదవికి అసలు పోటీనే లేదని భావించగా తాజాగా ద్విముఖ, త్రిముఖ పోరు ఉండడం ఇప్పుడు చర్చనీయాంశం అయింది. వీరిలో ప్రధానంగా రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్  కాగా మరొకరు కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్. ఒకవేళ రాహుల్ గాంధీ పోటీ చేయకుంటే నేను అధ్యక్ష పదవి రేసులో ఉంటానని దిగ్విజయ్ సింగ్ ప్రకటించడంతో పోరు రసవత్తరంగా మారింది.