మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గా రాహుల్ నర్వేకర్

0
84

మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం ముగింపు దశకు చేరింది. కొత్త సీఎం ఏక్​నాథ్ శిందే సర్కారు బలనిరూపణకు వీలుగా ఆదివారం అసెంబ్లీ స్పీకర్ ఎన్నిక జరిగింది. స్పీకర్ పదవి కోసం భాజపా తరపున రాహుల్‌ నర్వేకర్‌.. మహావికాస్ అఘాడీ తరపున రాజన్‌ సాల్వీ పోటీపడ్డారు. శివసేన తిరుగుబాటు నేత, ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే.. భాజపాతో చేతులు కలిపిన నేపథ్యంలో రాహుల్‌ నర్వేకర్‌ స్పీకర్​ పదవికి ఎన్నికయ్యారు.