రైలు ప్ర‌యాణానికి కొత్త రూల్స్ త‌ప్ప‌కుండా ఇవి పాటించాల్సిందే

రైలు ప్ర‌యాణానికి కొత్త రూల్స్ త‌ప్ప‌కుండా ఇవి పాటించాల్సిందే

0
84

ఇప్ప‌టి వ‌ర‌కూ రైలు ప్ర‌యాణం అంటే ప‌ది నిమిషాల ముందు ట్రైన్ స్టేష‌న్ కు వెళితే స‌రిపోయేది ..కాని ఇప్పుడు క‌రోనా తో ఈ స‌మ‌యంలో మార్పు రానుంది, అంతేకాదు ట్రైన్ జ‌ర్నీ కూడా బాగా మారే అవ‌కాశం ఉంది. క‌చ్చితంగా విమాన ప్ర‌యాణానికి ఎలా రెండు గంట‌ల ముందు వెళ‌తామో ఇప్పుడు అలాంటి ప‌రిస్దితి రానుంది.

త్వరలో లాక్ డౌన్ ను తొలగించి, రైళ్లు నడిచేందుకు అనుమతులు లభిస్తే, రైళ్లలో ప్రయాణాలకు కొన్ని నిబంధనలు పాటించడం తప్పనిసరి. అందుకే రైల్వే స్టేషన్లలో మాక్ డ్రిల్స్ జరుగుతూ ఉన్నాయి..జీఆర్పీ, ఆర్పీఎఫ్ సిబ్బంది ఈ డ్రిల్స్ చేస్తున్నారు, ఇక మీ రైలు 10 గంట‌ల‌కు అయితే మీరు 8 గంట‌ల‌కు స్టేష‌న్ కు రావాల్సిందే.

కొత్త కొత్త ఎంట్ర‌న్స్ లు మ‌రో నాలుగు లేదా ఐదు ఏర్పాటు చేస్తారు, కేవ‌లం వ‌చ్చే ట్రైన్ కి మాత్ర‌మే ఆ ట్రైన్ ఎక్కే వారిని ముందు అనుమ‌తిస్తారు..ప్ర‌యాణికులు మాస్క్ లు ధరించడం తప్పనిసరి. ఆపై ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి. ఎటువంటి అనారోగ్యమూ లేదని తేలితేనే రైలు ఎక్కేందుకు అనుమతి లభిస్తుంది. టికెట్ తీసుకునే స‌మ‌యంలో సామాజిక దూరం ఉండాలి, మీ టెంప‌రేచ‌ర్ టెస్ట్ చేస్తారు,
రైల్వే స్టేషన్లలో ధర్మల్ పరీక్షలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. మొత్తానికి రైల్వే శాఖ కూడా ఏర్పాట్ల‌లో బిజీగాఉంద‌ట‌.