లంచాలకు అలవాటుపడిన వారు అసలు వాటిని తీసుకోకుండా ఉండలేరు ..రోజు లక్షల రూపాయల లంచం తీసుకుని ఇంటికి వెళ్లే మహానుభావులు ఉన్నారు కొందరు ఉద్యోగుల్లో… ఇలాంటి వారిని అడ్డంగా బుక్ చేస్తున్నారు . ఇటీవల కోటిరూపాయల లంచం తీసుకుంటూ దొరికిన అధికారులకి కూడా చూశాం, అయితే రైల్వేలో ఇలాంటి వార్తలు చాలా తక్కువగానే వింటాం కాని.
సీబీఐ చరిత్రలోనే అతిపెద్ద లంచావతారాన్ని అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వేస్‌లో ఇంజినీరింగ్ సర్వీస్ సీనియర్ అధికారి మహేందర్‌సింగ్ చౌహాన్ అడ్డంగా దొరికాడు.
సుమారు కోటి రూపాయల లంచం తీసుకుంటున్న సమయంలో అధికారులు పట్టుకున్నారు..
నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్‌లో మరిన్ని ప్రాజెక్టుల కాంట్రాక్ట్‌లను ఇప్పించేందుకు గాను ఈ అధికారి లంచం తీసుకున్నాడు, మహేంద్రసింగ్ రైల్వేస్ ఇంజినీరింగ్ సర్వీస్ 1985 బ్యాచ్ అధికారి. ఓ పక్క ఉద్యోగాలు లేక నిరుద్యోగులు బాధపడుతుంటే ఇలాంటి లంచం మేస్తున్న వారు కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదిస్తున్నారు అని ప్రజలు విమర్శలు చేస్తున్నారు.