రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ మరిన్ని ట్రైన్స్ ఎప్పటి నుంచంటే

రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ మరిన్ని ట్రైన్స్ ఎప్పటి నుంచంటే

0
89

దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న వేళ మార్చి నెల చివరి నుంచి రైలు సర్వీసులు నిలిచిపోయాయి, దాదాపు మూడు నెలల వరకూ రైళ్లు నడవలేదు, ఈ సమయంలో ఢిల్లీ నుంచి 30 స్పెషల్ ట్రైన్ లు నడిపారు, అవి కూడా కొన్ని స్టేషన్లో మాత్రమే ఆగేవి.

ఇక తర్వాత మరో రెండు వందల ట్రైన్స్ నడిపారు, ఇక దేశంలో వేలాది ట్రైన్స్ సర్వీసులు లేక ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు, ఓపక్క బస్సులు లేక రైళ్లు లేక అవస్తలు పడుతున్నారు, అయితే అన్ లాక్ 4 స్టార్ట్ అయింది.. ఈ సమయంలో మరిన్ని రైల్వే సర్వీసులు స్టార్ట్ చేస్తాము అని తెలిపింది రైల్వేశాఖ.

రైల్వే మంత్రిత్వ శాఖ తాజాగా ఈ విషయాన్ని వెల్లడించింది. రైల్వే ప్రయాణికుల కోసం మరిన్ని ట్రైన్స్ అందుబాటులోకి తీసుకురావాలని ఆలోచిస్తోంది…ట్రైన్ ప్యాసింజర్ల కోసం మరిన్ని స్పెషల్ ట్రైన్స్ నడపాలని ఆలోచన చేస్తున్నాము అని రైల్వేస్ తెలిపింది… దీనిపై రైల్వే మంత్రిత్వ శాఖ ట్వీట్ చేసింది. వచ్చేవారం ఎన్ని కొత్త సర్వీసులు నడుపుతారు అనేది తెలియచేయనుంది రైల్వేశాఖ అని వార్తలు వినిపిస్తున్నాయి.