అగ్నిపథ్ కు వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో విధ్వంసానికి పాల్పడిన వారిలో ఇప్పటివరకు 46 మందిని అరెస్టు చేసినట్లు రైల్వే ఎస్పీ అనురాధ వెల్లడించారు. ఈ ఘటనలో మిగిలిన వారికోసం గాలిస్తున్నట్లు చెప్పారు. అభ్యర్థులను రెచ్చగొట్టిన కోచింగ్ సెంటర్లను గుర్తించామని తెలిపారు. వాట్సాప్ గ్రూపుల్లో చర్చించి ఈ దాడికి పాల్పడ్డారని ఎస్పీ తెలిపారు.
17వ తేదీన ఉదయం 8 గంటలకు 300 మంది చొరబొడ్డారు. ఈస్ట్ కోస్ట్, దనపుర్ ఎక్స్ ప్రెస్ లో వాళ్లు వచ్చారు. మొత్తం 30 ట్రైన్ కోచ్ లు డ్యామెజ్ అయ్యాయి. ఒక కోచ్ ను పెట్రోల్ పోసి కాల్చేశారు. అగ్నిపథ్ కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వచ్చారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ అల్లర్లలో.. అరెస్టైన వారంతా తెలంగాణ వాళ్లేనని వెల్లడించారు. వీరికి జీవితకాలం శిక్ష పడే అవకాశం ఉందన్నారు.
లోకో ఇంజిన్ లో 4 వేల లీటర్ల ఆయిల్ ఉంది.. వాటిని కాల్చితే ఎక్కువ మరణాలు జరుగుతుంది అని మేము ఫైర్ చేశాము. మిగిలినవి అన్ని 20 రౌండ్స్ RPF వాళ్ళు ఫైర్ చేశారు. మొత్తం 58 కోచ్ లు నాశనం అయ్యాయి. 12 కోట్లు నష్టం వాటిల్లినట్టు తెలిసింది. ఒక సారి వీళ్ళ మీద కేసు నమోదు చేస్తే రైల్వే యాక్ట్ ప్రకారం వీళ్ళకి ఇక ప్రభుత్వ ఉద్యోగం రాకపోవచ్చు. మా దగ్గర సీసీ ఫుటేజ్ ఉన్నాయి.. వాటిని పరిశీలిస్తున్నాము. 9 మంది మా రైల్వే స్టాఫ్ గాయపడ్డారు. హైదరాబాద్ పోలిస్ లకి కేసు ట్రాన్స్ఫర్ చేశాం అని ఎస్పీ అనురాధ తెలిపారు.