రాజధాని ఇక్కడే ఉండాలి వైసీపీ నేత యూటర్న్

రాజధాని ఇక్కడే ఉండాలి వైసీపీ నేత యూటర్న్

0
85

ఏపీ రాజధాని తరలిపోతుంది అని తెలియడంతో రైతులు చాలా మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. వారితో పాటు తెలుగుదేశం నేతలు జనసేన నేతలు కూడా రాజధాని మార్పు కుదరదు అని తెలియచేస్తున్నారు.. రైతులు దీక్షలకు కూడా కూర్చుంటున్నారు.. అయితే వైసీపీ నేతలు అధికారంలో ఉన్నారు. తాజాగా వైసీపీ నేత ఒకరు అమరావతి రాజధాని నుంచి తరలిపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.

ఆ పార్టీ నేత అమరావతి నుంచి రాజధాని తరలిపోవడం బాధగా ఉందని మల్లెల హరీంద్రనాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. గత ఐదు రోజుల నుంచి రైతులు ధర్నాలు చేస్తున్నారని, వైసీపీలో ఉండి తాము ఏం చేయలేకపోతున్నామని వాపోయారు. జగన్ తీసుకున్న నిర్ణయం పై వైసీపీ నేతలు అందరూ ముఖ్యమంత్రి నిర్ణయం పై ఎస్ చెబుతుంటే ఆయన ఇలా వేరే వాయిస్ వినిపించడం పై అందరూ షాక్ అయ్యారు..

పార్టీలతో సంబంధం లేకుండా రైతుల ధర్నాకు మద్దతు ఆయన ప్రకటించారు. ఎన్ని రాజధానులు పెట్టుకున్నా తమకు అభ్యంతరం లేదని, అమరావతిలో రాజధాని పనులు కొనసాగాలని డిమాండ్ చేశారు. అమరావతిపై సీఎంతో చర్చించి కార్యాచరణ ప్రకటిస్తామని మల్లెల హరీంద్రనాథ్ తెలిపారు. మరి ఆయన ఈ రాగం తీయడంపై జనసేన టీడీపీ కూడా అదే అంటున్నాయి. వైసీపీ నేతలే కొందరు దీనిని వ్యతిరేకిస్తున్నారు అని తెలియచేస్తున్నారు.