రాజధాని రైతులపై కరోనా ఎఫెక్ట్….

రాజధాని రైతులపై కరోనా ఎఫెక్ట్....

0
104

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తుంది… దీన్ని అరికట్టేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పలు చర్యలు తీసుకుంటున్నారు… అందులో భాగంగానే ఈనెల 22న దేశ వ్యాప్తంగా కర్ఫ్యూ విధించారు… ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు ఎవ్వరు బయటకు రాకాడదని ప్రకటన చేసింది…

కరోనా విజృంచిస్తున్న నేపథ్యంలో ఎటువంటి సభలను సమావేశాలు నిర్వహించ కూడదని తెలిపింది… ఇప్పుడు ఈ ఎఫెక్ట్ రాజధాని రైతులపై పడింది… రాజధానిని అమరావతిలో ఉంచాలని డిమాండ్ చేస్తూ గత 94 రోజులుగా ధర్నాలు చేస్తున్నారు…

వీరిపై కరోనా ఎఫెక్ట్ పడింది… తాజాగా మంగళగిరి ప్రాంతంలోనూ కరోనా పాజిటివ్ కేసు నమోదు కావడంతో పోలీసులు రాజధానిలో ఎటువంటి దీక్షలు చేయవద్దని సూచించారు…