ఏపీ రాజధాని అమరావతి నుంచి సచివాలయాన్ని తరలించేందుకు అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డేట్ ఫిక్స్ చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి… అభివృద్ది వికేంద్రీకరణ దిశగా తమ ప్రభుత్వం అడుగులు వేస్తోందని ప్రభుత్వ నాయకులు చెబుతున్నారు…
ఇటీవలే అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా చెప్పారు… కర్నూల్ కు జ్యుడీషియల్ క్యాపిల్ అలాగే విశాఖకు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, అమరావతి లెజిస్లేటివ్ క్యాపిటల్ రావచ్చని ప్రకటించారు… ఇక జీఎన్ రావు కమిటీ కూడా అదే తెలిపింది…
ఇప్పుడు బీసీజీ కమిటీ కోసం వేయిట్ చేస్తున్నారు… ఈ కమిటీ వచ్చిన తర్వాత ఏప్రిల్ ఆరున సచివాలయాన్ని విశాఖకు తరలించాలని చూస్తోంది వైసీపీ సర్కార్… ఏప్రిల్ 6వ తేదీ సోమవారం విశాఖలో సచివాలయ నుంచి పనులు జరగాలని ఇప్పటికే సచివాలయ సిబ్బందికి ప్రభుత్వం మౌళిక ఆదేశాలను జారీ చేసింది… వచ్చే నెలలో ఉత్తర్వులను కూడా జారీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది…