రాజధాని విషయంలో పవన్ మరో కీలక డెసిషన్…

రాజధాని విషయంలో పవన్ మరో కీలక డెసిషన్...

0
122

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు… ఈ నెల 10న రాజధాని ప్రాంతంలో పర్యటిస్తామని తెలిపారు… ఈమేరకు ఆయన ఒక ప్రకటన కూడా విడుదల చేశారు… మూడు రాజధానుల ప్రస్థావన చేసిన నాటినుంచి అమరావతి రైతులు ధర్నాలు, ర్యాలీలు, నిరసనలు చేస్తున్న సంగతి తెలిసిందే…

నేటికి వీరి ఆందోళనలు 50 రోజులకు చేరుకుంది…. ఆడపడుచులు రైతులు ఆందోళనలు మొదలు పెట్టి 50 రోజులు పూర్తయ్యాయని పవన్ అన్నారు… ఈమేరకు ఆయన ఒక ప్రకటన కూడా విడుల చేశారు… వీరు అనుసరిస్తున్న ఉద్యమ స్పూర్తి అనుసరిస్తున్న శాంతి యుత పంథాను చూసి తెలుగువాళ్లు గర్విస్తున్నారని తెలిపారు…

రోడ్డున పడ్డ రైతులకు అండగా ఉంటామని అన్నారు… గతంలో మాటిచ్చామని తెలిపారు అందుకే ఈనెల 10న మరోసారి రాజధాని ప్రాంతంలో పర్యటిస్తామని తెలిపారు… రైతులు పోరాటానికి సంపూర్ణమద్దతు ఇస్తున్నామని తెలిపారు పవన్…