రాజ‌కీయాల్లోకి రావ‌డం లేదు – రజనీకాంత్ ప్ర‌క‌ట‌న- కార‌ణం ఇదే

రాజ‌కీయాల్లోకి రావ‌డం లేదు - రజనీకాంత్ ప్ర‌క‌ట‌న- కార‌ణం ఇదే

0
106

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్ మ‌రికొద్ది రోజుల్లో కొత్త రాజ‌కీయ పార్టీ అనౌన్స్ చేయ‌నున్నారు, అయితే ర‌జ‌నీ ఈనెల 31 న కొత్త పార్టీ ప్ర‌క‌ట‌న చేస్తారు అని చెప్పారు, అయితే ఇప్ప‌టికే అన్నాత్తే సినిమా షూటింగు కోసం ఇక్క‌డ‌కు వ‌చ్చిన ఆయ‌న హైద‌రాబాద్ లో స్వ‌ల్ప అస్వ‌స్ధ‌త‌కు గురి అయ్యారు. ఇక కోలుకున్న వెంటనే తిరిగి చెన్నై వెళ్లిపోయారు.

శరీరంలో బీపీ లెవల్స్‌ హెచ్చుతగ్గులు కావడంతో జూబ్లిహిల్స్‌లోని అపోలో ఆస్పత్రిలో చేరిన ఆయ‌న కోలుకున్నారు, ర‌జనీ కూతుళ్లు ఆయనతో రాజ‌కీయాలు వ‌ద్దు అని చెప్పార‌ట‌, ఇద్ద‌రు కూతుళ్లు రాజ‌కీయాల్లోకి వెళ్ల‌ద్దు అన్నారు, కుటుంబం కూడా ఇదే కోరుకుంది.

తాజాగా ఆయ‌న రాజ‌కీయ ఎంట్రీ చేయడం లేదు అని తెలిపారు, మూడు పేజీల లేఖ విడుద‌ల చేశారు, అభిమానులు క్ష‌మించాలి అని కోరారు, ఆరోగ్యం స‌హ‌క‌రించ‌డం లేదు ఈ స‌మ‌యంలో బ‌య‌ట‌కు వ‌స్తే ముప్పే అని తెలిపారు..రోడ్డు మీదకు వస్తే ఆరోగ్యానికి ముప్పుగా మారే అవకాశం ఉంది
రాజకీయాల్లోకి రాకుండానే ప్రజలకు సేవ చేస్తాను అని ర‌జ‌నీకాంత్ తెలిపారు.