సీఎం జగన్ ని ఫాలో అవుతున్న సూపర్ స్టార్ రజనీ….

సీఎం జగన్ ని ఫాలో అవుతున్న సూపర్ స్టార్ రజనీ....

0
96

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్ ఫాలో అవుతున్నారా అంటే అవుననే అంటున్నారు రాజకీయ మేధావులు… గతంలో జగన్ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసి అధికారంలో వచ్చారు…

అయితే ఇప్పుడు రజనీ కాంత్ కూడా అదే బాటపట్టారని వార్తలు వస్తున్నాయి… వచ్చే సంవత్సరం తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి… అందుకే తలైవా ఏప్రిల్ రెండో వారంలో పార్టీ పేరును లక్ష్యాలను స్వయంగా ప్రకటించి తర్వాత ఆగస్ట్ నెల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేయాలని చూస్తున్నారట… అధికా పీఠం దక్కించుకోవాలంటే పాదయాత్ర ఒక్కటే మార్గమని భావిస్తున్నారట…

అందుకే ఆయన జగన్ ను ఫాలో అవ్వాలని చూస్తున్నారని వార్తలు వస్తున్నాయి… ఈ పదయాత్ర కనీసం 8 నుంచి 9 నెలలు ఉంటుందని తెలుస్తోంది… ఇందుకు సంబంధించిన రూట్ మ్యాప్ కూడా సిద్ద అయినట్లు తెలుస్తోంది… పాదయాత్రలో అన్నాడీఎంకే నేతలు రజనీ సమక్షంలో పార్టీలో చేరుతారని తెలుస్తోంది…