జగన్ చంద్రబాబు దారిలో రజనీకాంత్

జగన్ చంద్రబాబు దారిలో రజనీకాంత్

0
95

తమిళనాడులో రాజకీయం హీట్ ఎక్కుతోంది, ఇప్పుడు సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలి అని చూస్తున్నారు.. కొత్తగా పార్టీ పెట్టి ఎన్నికల్లో పోటీ చేయాలి అని చూస్తున్నారు… తమిళనాట ఆయన ప్రజల్లోకి వెళ్లాలి అని చూస్తున్నారు.

ఏప్రిల్ రెండో వారంలో పార్టీ పేరును, లక్ష్యాలను స్వయంగా ప్రకటించనున్నారట రజనీకాంత్ , పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళితే వారి సమస్యలు తెలుసుకునే అవకాశం ఉంటుంది అని భావిస్తున్నారు, ఇక ఆ సమయంలో పార్టీ గురించి పలు కీలక ప్రకటనలు హమీలు ఇవ్వనున్నారట.

ముఖ్యంగా సౌత్ లో రాజకీయంగా చూసుకుంటే ఏపీలో చంద్రబాబు వైయస్సార్ జగన్ ఇలా ముగ్గురు పాదయాత్ర చేసీ సీఎంలు అయ్యారు.. అందుకే ఆయన కూడా ఈ ఆలోచన చేస్తున్నారు అంటున్నారు.
ఏప్రిల్ 14తర్వాత ఆయన ప్రకటన అయితే ఉంటుంది, ఇక ఆయన బీజేపీతో కలిసి ముందుకు నడుస్తారు అని కూడా కొందరు అంటున్నారు, అలాగే అన్నా డీఎంకే నుంచి కొందరు ఆయన పార్టీలోకి చేరే అవకాశాలు కూడా ఉంటాయట.