పార్టీపేరు ప్రకటించేందుకు డేట్ ఫిక్స్ చేసిన సూపర్ స్టార్ రజనీ కాంత్…

పార్టీపేరు ప్రకటించేందుకు డేట్ ఫిక్స్ చేసిన సూపర్ స్టార్ రజనీ కాంత్...

0
80

తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్ తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానని చెప్పి చాలా రోజు అయింది.. కానీ ఇంతవరకు ఆయన రాలేదు… ఇటీవలే ఆయన గురించి కొన్ని వార్తలు వచ్చాయి… రజనీ పార్టీ పేరు ప్రకటించేందుకు సిద్దమయ్యారని వార్తలు వచ్చాయి… కానీ ఇంతవరకు సూపర్ స్టార్ పార్టీ పేరు ప్రకటించలేదు… ఆతర్వాత బీజేపీలో చేరుతారంటూ వార్తలు కూడా వచ్చాయి… అన్ని రాష్ట్రాల్లో పట్టుసాధిస్తున్న బీజేపీ ఇప్పుడు తమిళనాడులో కూడా తన పట్టు సాధించుకోవాలని చూస్తున్న తరుణంలో ఈ వార్తలు వచ్చాయి…

కానీ ఈ వార్తల్లో ఏ మాత్రం నిజంలేదని అప్పట్లో అభిమానులు చెప్పుకొచ్చారు.. అయితే ఇదే క్రమంలో రజనీపై మరో వార్త వైరల్ అవుతోంది… త్వరలో పార్టీ పేరు ప్రకటించడానికి సిద్దమయ్యారని వార్తలు వచ్చాయి.. త్వరలోనే దీనిగురించి ఆయన ఒక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది… ఈ ఏడాదిలోనే రజనీ పార్టీ పేరు ప్రకటిస్తారని మొదటి నుంచి వార్తలు వచ్చాయి.,.. వాస్తవానికి మార్చి 12న పార్టీని ప్రారంభిద్దామని అనుకున్నారు.. కానీ కారోనా కారణంగా వాయిదా పడింది…

వచ్చే నెలలో పార్టీ పేరు ప్రకటించాలని భావించారు కానీ ఇప్పుడున్న పరిస్థితిలో కరోనా తగ్గిపోయేలా లేకపోవడంతో ఇది మరింత ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి… దీంతో ఈ ఏడాది నవంబర్ లో పార్టీ పేరు ప్రకటించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు… మరో వైపు అభిమానులు పార్టీ పేరు ఎలా ఉండబోతుందని చర్చించుకుంటున్నారు…