రాజస్థాన్ లో రాజకీయ ట్విస్ట్

రాజస్థాన్ లో రాజకీయ ట్విస్ట్

0
78

రాజస్థాన్ రాజకీయ సంక్షోభం అనూహ్యమలుపులు తిరుగుతున్నాయి.. రెబల్ నేత సచిన్ పైలెట్ వర్గానికి చెందిన 19 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ అనర్హత నోటీసులు జారీ చేసిన తర్వాత అశోక్ గెహ్లాట్ సర్కార్ మైనార్టీ లో పడిపోయిందని వెంటనే బలనిరూపణ చేసుకోవాలని విపక్షనేతలు డిమాండ్ చేశారు… తీరా బలపరీక్షకు సీఎం సిద్దంకాగా తాము ఆడిమాండ్ చేయనేలేదని కాషాయ నేతలు యూటర్న్ తీసుకున్నారు..

కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో బీజేపీ కీలక నేతలు బేనసారాలు నెరిపిన వీడియోలపై దుమారం కొనసాగుతున్నది… వారం రోజులుగా రాజస్థాన్ లో కొనసాగుతున్న సంక్షోభానికి తెరదించే దిశగా సీఎం అశోక్ గెహ్లాట్ అడుగులు వేస్తున్నార…

ఈ నెల 22 లోగా అసెంబ్లీ లో బలపరీక్ష నిర్వహించాలని డిసైడ్ అయినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి….అందుకోసం అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తారని సమాచారం…200 స్థానాలున్న రాజస్థాన్ లో కాంగ్రెస్ మొత్తం 107 సీట్లు దక్కించుకుని అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసందే..