Breaking News- చంద్రబాబుకు నటుడు రజనీకాంత్ ఫోన్..ఎందుకో తెలుసా?

0
81

ఏపీ​ శాసనసభలో జరిగిన పరిణామాలపై టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. వైకాపా సభ్యులు ఏకంగా ఆయన సతీమణి భువనేశ్వరిని కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని కన్నీటి పర్యంతమయ్యారు. మంగళగిరిలోని తెదేపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెక్కి వెక్కి ఏడ్చారు.

ఏపీ అసెంబ్లీలో ఘటనల పట్ల రజనీకాంత్ విచారం వ్యక్తం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు రజనీకాంత్ ఫోన్ చేసి పరామర్శించారు.