వైయస్ షర్మిలకు రాజ్యసభ సీటు ప్రధాన కారణం ఇదే

వైయస్ షర్మిలకు రాజ్యసభ సీటు ప్రధాన కారణం ఇదే

0
79

ఏపీలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తాజాగా ఆయన సోదరి వైయస్ షర్మిలకు కేంద్రమంత్రి పదవి ఇస్తారు అని వార్తలు వినిపిస్తున్నాయి.. అయితే గతంలో కూడా ఆయన షర్మిలమ్మకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వబోతున్నారు అని వార్తలు వినిపించాయి.. ఎన్నికల ముందు ఎన్నికల తర్వాత కూడా ఈ వార్తలు వినిపించాయి.

అయితే ఆమెకి ఎన్నికల్లో ఎంపీ టికెట్ అని కూడా అన్నారు..కాని ఆమెకి ప్రత్యక్షంగా ఎన్నికల్లో పోటీ చేయడం ఇష్టంలేక ఆమె పోటీ అనే ఆలోచన విరమించుకున్నారు అని మరో వార్త వచ్చింది.. తాజాగా ఈసమయంలో హస్తినలో వైసీపీ కార్యక్రమాలు అలాగే కేంద్రంతో చర్చించి ఏపీకి రావలసిన నిధుల గురించి చర్చించి తీసుకువచ్చేలా వైయస్ షర్మిల అయితే బాగుంటుంది అని పార్టీ నేతలు కూడా భావిస్తున్నారు.

అందుకే ఆమెకి వచ్చే ఏప్రిల్ లో రాజ్యసభ పదవుల ఎంపికలో అవకాశం ఇచ్చి ఆమెని ఎంపీగా తీసుకోవాలి అని అంటున్నారు. అయితే దీనిపై వైసీపీ నేతలు కూడా ఎక్కడా ఖండించడం లేదు. అందుకే సీఎం జగన్ మదిలో ఆలోచన ఉంది అని నేతలు భావిస్తున్నారు, చూడాలి ఏం జరుగుతుందో.